నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ "ప్రాజెక్ట్ K" సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాలో యంగ్ రెబెల్ స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనె నటిస్తుంది. ఈ హై బడ్జెట్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో అశ్వత్థామ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సిలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు టాక్. ఈ షెడ్యూల్ లో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్ వెల్లడించారు. ప్రభాస్ సూపర్ హీరోగా కనిపించనున్న ఈ సినిమాని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa