ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'భూల్ భూలయ్యా 2' టీజర్ అవుట్

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 14, 2022, 05:47 PM

బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ కార్తీక్ ఆర్యన్ అండ్ గ్లామర్ బ్యూటీ కియారా అద్వానీ నటించిన 'భూల్ భూలయ్యా 2' గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా మొదటి టీజర్‌ను విడుదల చేసారు. హార్రర్ కామెడీ ట్రాక్ లో రానున్న ఈ సినిమా గ్లిమ్ప్స్ ని కియారా అద్వానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. టీజర్‌లో పాపులర్ సాంగ్ 'అమీ జే తోమర్' BGMతో కొన్ని భయానక సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఈ సినిమా 'భూల్ భూలయ్యా' (2007)కి సీక్వెల్, ఇది చంద్రముఖికి రీమేక్. అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టబు, రాజ్‌పాల్ యాదవ్ అండ్ సంజయ్ మిశ్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి-సిరీస్ మరియు సినీ 1 స్టూడియోస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, మురాద్ ఖేతాని, అంజుమ్ ఖేతాని మరియు క్రిషన్ కుమార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa