ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మే నెలలో 'సాలార్' టీజర్ విడుదల కానుందా?

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 14, 2022, 05:50 PM

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'సాలార్' సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తుంది. ఈ సినిమా 30% షూటింగ్ పూర్తయిందని, మిగిలినది రాబోయే రోజుల్లో పూర్తవుతుందని మేకర్స్ వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం, 'సాలార్' మూవీ టీజర్ ని సౌత్ లో 'KGF 2' ప్రింట్లతో విడుదల కానుంది అని వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్త నిజం కాదు అని మూవీ మేకర్స్ ప్రకటించారు. తాజా అప్డేట్ ప్రకారం, మే నెలాఖరున ఈ  సినిమా టీజర్ ని మూవీ మేకర్స్ విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ సినిమాలో గోపీ, జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. రవి బస్రూర్‌ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa