బాలీవుడ్ సెలబ్రిటీ జంట అయిన అలియా భట్, రణ్ బీర్ కపూర్ ల పెళ్లి ఈ రోజు ఘనంగా జరిగింది. కేవలం కొద్ది మంది బంధువుల సమక్షంలోనే ఈ పెళ్లి తంతు నిర్వహించారు. కవూర్ ఫ్యామిలీ సంప్రదాయం ప్రకారం ఈ పెళ్లి వేడుక జరిగింది. అయితే ఈ పెళ్లి వేడుకను ఇరు కుటుంబీకులు అత్యంత గోప్యంగా నిర్వహించడంతో ఫ్యాన్స్ బాధపడుతున్నారు.
అధికారికంగా పెళ్లి గురించి ప్రకటించలేదు. అలాగే ఎవ్వరికీ కూడా ఇన్విటేషన్లు ఇవ్వలేదు. ఇలా సీక్రెట్ పెళ్లి చేసుకోవడం ఏంటని అభిమానులు నోరెళ్లబెడుతున్నారు. మొత్తానికి ఈ సెలబ్రిటీ జంట ఒక్కటయ్యింది. పెళ్లి వేడుక ముగిసింది. పాత లవ్ బర్డ్స్ కాస్తా కొత్త దంపతులయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa