2019లో వచ్చిన మల్లేశం సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది తెలంగాణా అమ్మాయి అనన్యా నాగళ్ళ. అయితే 2021లో పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రంలో ఒక కీలక పాత్ర ను పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలో నివేదా థామస్, అంజలి తో పాటు నటించిన అనన్యకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో అప్పటి నుండి వరస ఫోటోషూట్లను చేస్తూ, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తెగ హంగామా చేస్తుంది. వకీల్ సాబ్ సినిమా తర్వాత నుండి ఈ అమ్మడికి వరస పెట్టి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం సమంత ప్రధాన పాత్ర పోషిస్తున్న శాకుంతలం లో నటిస్తుంది అనన్య. అయితే ఈ బ్యూటీ కోలీవుడ్ లో డెబ్యూ ఇచ్చేందుకు రెడీ అయిందని చిత్రసీమలో వార్తలు వస్తున్నాయి. తమిళ హీరో శశి కుమార్ నటిస్తున్న కొత్త చిత్రంలో హీరోయిన్ గా అనన్య ను సెలెక్ట్ చేశారట ఆ చిత్రబృందం. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ కి తంగం శరవణన్ దర్శకత్వం చేస్తుండగా, మోహన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనతికాలంలోనే అనన్య కోలీవుడ్ లో కూడా డెబ్యూ చేస్తుండటంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa