ప్రముఖ నిర్మాత దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి 'రౌడీ బాయ్స్' సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా సంక్రాంతికి విడుదలై మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. తాజాగా ఇప్పుడు ఈ యంగ్ హీరో మరో సినిమాతో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమవుతున్నాడు. కాశీ విశాల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి 'సెల్ఫిష్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమా ఈరోజు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ పూజా కార్యక్రమానికి కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దిల్ రాజు, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, వేణు శ్రీరామ్ తదితరులు ఈ లాంచ్ ఈవెంట్ కి హాజరయ్యారు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. దిల్ రాజు ఎస్వీసీ బ్యానర్‌పై దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa