తెలుగు ప్రేక్షకులకి సుమ కనకాల గురించి పరిచయం అవసరం లేదు. ప్రముఖ హోస్ట్, యాంకర్ సుమ కనకాల ‘జయమ్మ పంచాయతీ’ అనే సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో రానున్న ఈ సినిమా నుంచి మేకర్స్ ఒక అప్డేట్ ని రిలీజ్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ఏప్రిల్ 16, 2022న లాంచ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ రేపు ఉదయం 11:07 గంటలకు ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇదే విషయాన్ని తెలియజేసేందుకు ఒక స్పెషల్ పోస్టర్‌ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రం మే 6, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై బలగ ప్రకాష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa