ట్రెండింగ్
Epaper    English    தமிழ்

USAలో 14 మిలియన్ల మార్క్ కి చేరువగా 'RRR'

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 16, 2022, 10:38 AM

SS రాజమౌళి డైరెక్షన్ లో టాలీవుడ్ స్టార్ హీరోస్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'RRR' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. అడ్వాన్స్ బుకింగ్స్ నుంచి ప్రీమియర్ షోల వరకు ఈ సినిమా USA బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామా సినిమా USAలో ఆల్ టైమ్ రికార్డ్‌ను క్రియేట్ చేస్తుంది. తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమా గురువారం నాడు $26,272K వసూలు చేసింది. దీంతో ఇప్పటివరకు సినిమా టోటల్ కలెక్షన్స్ $13,800897Kకి చేరాయి. ఈ సినిమా 14 మిలియన్ల మార్క్ కి  చేరువగా వెళ్తుంది. ఈ యాక్షన్ డ్రామా మూవీలో అలియాభట్,సముద్రఖని, అజయ్ దేవగన్, శ్రియా శరణ్, ఒలివియా మోరిస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ స్థాయిలో నిర్మించారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa