చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆచార్య. ఎన్నో వాయిదాల తర్వాత ఈ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా సిద్ధ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర నిడివి 40 నిమిషాలు ఉంటుందని, చిరంజీవితో 20 నుంచి 25 నిమిషాల పాటు సన్నివేశాలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రను కాస్త ట్రిమ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రన్ టైం ఎక్కువైపోవడంతో రామ్ చరణ్ క్యారెక్టర్ ను కుదించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆచార్యలో రామ్ చరణ్ పాత్ర పొడిగించిన అతిధి పాత్ర మాత్రమే అని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa