విజయ్ జోసెఫ్ హీరోగా పూజా హెగ్డే నటించిన చిత్రం “బీస్ట్”. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదలై భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. అయితే ఓవర్సీస్‌లో తమిళంలో కూడా ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది.
ఈ చిత్రం యుఎస్ బాక్సాఫీస్ వద్ద తమిళ వెర్షన్‌లో $ 1 మిలియన్ మార్కును దాటినట్లు ధృవీకరించబడింది. దీంతో సినిమాకు అక్కడ మంచి పట్టు వచ్చిందనే చెప్పాలి. అలాగే ఈ సినిమాతో విజయ్ ఖాతాలో మరో $1 మిలియన్ సినిమా చేరి ఈ లిస్ట్‌లో అతని నుంచి ఐదో సినిమా “బీస్ట్” నిలిచాడు. మొత్తానికి “బీస్ట్” అక్కడ దద్దరిల్లిపోయి, లాస్ట్‌లో ఎక్కడ నిలుస్తుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa