ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2”. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించగా, సంజయ్ దత్ మరియు ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనూ తొలిరోజు సాలిడ్ కలెక్షన్స్ అందుకుంది.
నైజాంలో మొదటి రోజు మన స్టార్ హీరోల సినిమాల రేంజ్ లో ఈ సినిమా 9 కోట్లకు పైగా షేర్ ని అందుకుంది. దీంతో ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే 17 కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేసింది. మొత్తానికి కేజీఎఫ్ 2 నైజాంలో మంచి వసూళ్లు రాబడుతోంది. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఎక్కడ ఆగుతుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa