మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన 'గని' త్వరలో ఓటీటీలో ప్రసారం కానుంది. బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 8న థియేటర్లలో విడుదల అయింది. కేవలం 15 రోజుల్లోనే 'ఆహా'లో విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఏప్రిల్ 22 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై 'ఆహా' అధికారికంగా తెలియజేసింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించింది. కన్నడ హీరో ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, జగపతి బాబు, నదియా కీలకపాత్రల్లో నటించారు. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించారు. విడుదలైన తర్వాత ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం కేజీఎఫ్-2, బీస్ట్ వంటి భారీ చిత్రాలు థియేటర్లలో దండయాత్ర చేస్తున్నాయి. త్వరలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సిినిమా ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఈ పరిస్థితుల్లో ఓటీటీలో గని సినిమాను ప్రసారం చేసేందుకు చిత్ర యూనిట్ నిర్ణయించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa