యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్, విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించిన "అశోక వనంలో అర్జున కళ్యాణం" అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విశ్వక్ సేన్ సరసన ఈ సినిమాలో రుక్సార్ ధిల్లాన్ జంటగా నటించింది. ఈ చిత్రంలో కాదంబరి కిరణ్, గోపరాజు రమణ, కేదార్ శంకర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఎస్‌విసిసి డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు బి, సుధీర్ ఈదర నిర్మిస్తున్న ఈ చిత్రానికి బివిఎస్‌ఎన్ ప్రసాద్ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు రవికిరణ్ కోలా అందించారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ రొమాంటిక్ కామెడీ సినిమా మే 6, 2022న థియేటర్లలో విడుదలవుతుందని ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రకటించేందుకు ఒక స్పెషల్ పోస్టర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి జై క్రిష్ సంగీతం అందించారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం తన కొత్త సినిమా 'దస్ కా ధుమ్కీ' షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa