తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ నారాయణ్ దాస్ కె నారంగ్ (76) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతా బాధపడుతున్న ఆయనను హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించారు. నారాయణ దాస్ నారంగ్ 1946 జులై 27న జన్మించారు. ఏషియన్ మల్టీప్లెక్స్ , ఏషియన్ థియేటర్స్ అధినేతగా ఆయన పేరొందారు. ఇటీవల నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’,నాగశౌర్యతో ‘లక్ష్య’ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. డిస్ట్రిబ్యూటర్‌గా, ఫైనాన్షియర్‌గా ఆయన టాలీవుడ్‌లో ఎంతో పేరు సంపాదించారు. ప్రస్తుతం నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న 'ఘోస్ట్' సినిమాకు కూడా ఆయనే నిర్మాత. ఎంతో మృదు స్వభావిగా పేరొందిన నారాయణ్ దాస్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.