శ్రీ కోనేటి దర్శకత్వంలో బిగ్ బాస్ 4 ఫేమ్ సయ్యద్ సోహెల్ ర్యాన్ 'బూట్‌కట్ బాలరాజు' అనే సినిమాతో ప్రేక్షకులని అలరించడానికి సిద్దమవుతున్నాడు. సోహెల్ పుట్టినరోజు సందర్భంగా మూవీ మేకర్స్ ఒక వీడియో గ్లింప్సె ని విడుదల చేశారు. ఈ సినిమాలో సోహెల్ సరసన జోడిగా మేఘలేఖ నటిస్తుంది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి విఠల్ కొసనం ఆర్ట్ డైరెక్టర్ కాగా విజయ్ వర్ధన్ ఎడిట్ చేశారు. త్వరలోనే మూవీ మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. 'బూట్‌కట్ బాలరాజు' చిత్రాన్ని లక్కీ మీడియా, గ్లోబల్ ఫిలింస్ పతాకాలపై బెక్కెం వేణు గోపాల్ నిర్మిస్తున్నారు. శ్యామ్ కె నాయుడు ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa