చిరంజీవి హీరోగా రామ్ చరణ్ మరో కీలక పాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆచార్య. ఈ చిత్రంలో కాజల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమా ఏప్రిల్ 29న భారీ ఎత్తున విడుదల కానుంది. కాగా, ఈ చిత్రంలోని ఓ పాటను సంగీత దర్శకుడు మణిశర్మ విడుదల చేయగా, నిన్ననే భలే భలే బంజారా పాటను విడుదల చేయగా ఇప్పుడు దానికి మంచి స్పందన వస్తోంది.
ఇప్పటివరకు ఈ పాట 14 గంటల్లో 38 లక్షలకు పైగా వ్యూస్ సాధించగా, 2 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ముఖ్యంగా మెగా అభిమానులకు ఈ పాట మంచి ట్రీట్‌ని ఇస్తుంది. దీంతో పూర్తి పాట విజువల్‌గా ఎలా ఉంటుందోనని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa