ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్ దేవరకొండ-శివ నిర్వాణ సినిమా ఈ తేదీన ప్రారంభం కానుందా?

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 19, 2022, 11:44 AM

శివ నిర్వాణ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ మిలటరీ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ డ్రామా సినిమా చేయనున్నారు. ఈ సినిమాలో రౌడీ స్టార్ సరసన సమంత రూత్ ప్రభు రొమాన్స్ చేయనుంది. ఈ సినిమాకు రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించబోతున్నట్లు ఫిలిం ఇండస్ట్రీ లో వార్తలు వినిపిస్తున్నాయి. తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఈ  ప్రాజెక్ట్ ఈ నెల 21న హైదరాబాద్‌లో ప్రారంభించబడుతుంది అని సమాచారం. అయితే 23న షూటింగ్ ప్రారంభం కానుందని అలాగే ఈ సినిమాకి 'ఖుషీ' అనే టైటిల్ ని పెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు విపిస్తున్నాయి. ఇప్ప‌టికే ఈ సినిమా ప్రీ-ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ప్రారంభమయ్యాయి. ఈ క్రేజీ కాంబినేషన్‌ లో వస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa