పరశురామ్ పేట్ల డైరెక్షన్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'సర్కారు వారి పాట' మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు మరియు ప్రేక్షకులు కూడా చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని సాంగ్ షూట్ కోసం వేసిన సెట్స్ నుండి కొన్ని ఫోటోలని విడుదల చేసారు. ఈ స్నాప్‌లు ఇప్పుడు సోషల్ మీడియా అండ్ ఇంటర్నెట్ లో జోరుగా వైరల్ అవుతున్నాయి. మహేష్ అభిమానులు ఈ ఫొటోస్ ని రీషేర్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ స్టూడియోలో శరవేగంగా ఈ షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. సోషల్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ తో వచ్చిన మహేష్ ఈ సినిమాతో మళ్లీ "పోకిరి" ఫ్లేవర్ లో కనిపించనున్నాడు అని మూవీ మేకర్స్ వెళ్ళడించారు. GMB ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్ 'సర్కారు వారి పాట' సినిమాని నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa