రామ్ చిత్రాలలో పాటలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఇదిలావుంటే రామ్ మాస్ ఇమేజ్ ను ఎక్కువగా కోరుకుంటున్నాడు. మాస్ కంటెంట్ ఉన్న కథలనే ఎక్కువగా ఎంచుకుంటున్నాడు. అలా మాస్ అంశాలు పుష్కలంగా ఉన్న కథనే ఎంచుకుని ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి 'ది వారియర్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. తమిళ డైరెక్టర్ లింగుసామి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు.
రామ్ తన కెరియర్లో ఫస్టు టైమ్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ సినిమాలో, ఆయన సరసన నాయికలుగా కృతి శెట్టి - అక్షర గౌడ కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఈ సినిమా నుంచి 'బుల్లెట్' లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు.
ఈ నెల 22వ తేదీన సాయంత్రం 5:45 నిమిషాలకు ఈ సినిమా నుంచి 'బుల్లెట్' సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమాలో, నదియా .. భారతీరాజా ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. జూలై 14వ తేదీన ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలోను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa