టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రస్తుతం తెలుగులో మొట్టమొదటి సూపర్ హీరో సినిమా 'హను-మాన్' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటిస్తుండగా, అమృత అయ్యర్ హీరోయిన్ గా కనిపించనుంది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ అనే సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఇటీవల జరిగిన తెలంగాణ మాస్టర్స్ గేమ్స్ అసోసియేషన్ టోర్నమెంట్‌లో ఈ స్టార్ డైరెక్టర్ రెండు పతకాలను సాధించాడు. ఈ పోటీలో కాంస్య, రజత పతకాలను సొంతం చేసుకున్నాడు. తాజాగా 'అధిర' అనే మరో క్రేజీ సూపర్ హీరో ప్రాజెక్ట్‌ను కూడా ఈ స్టార్ డైరెక్టర్ ప్రకటించారు. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య తనయుడు కళ్యాణ్ ఈ యాక్షన్ మూవీలో కథానాయకుడిగా కనిపించనున్నాడు. 'హను-మాన్' సినిమా విడుదల తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది అని మేకర్స్ వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa