టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని నటించిన 'జెర్సీ' సినిమా విడుదలైయి నేటితో 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా కల్ట్ క్లాసిక్ చాలా మంది ఫేవరెట్‌గా మూవీగా మారింది. ఈ చిత్రంలో నాని సరసన జోడిగా శ్రద్ధా శ్రీనాథ్ నటించింది. ఈ సినిమా 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, మూవీ మేకర్స్ యూట్యూబ్‌లో ఈ సినిమా నుండి తొలగించబడిన సన్నివేశాన్ని విడుదల చేశారు. ఈ ఎమోషనల్ వీడియో ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది. రోనిత్ కమ్రా, సత్యరాజ్, రావు రమేష్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa