బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా బాక్స్ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ప్రస్తుతం అజయ్ తన కొత్త చిత్రం 'రన్‌వే 34' సినిమాని విడుదల చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేకాకుండా ఈ స్టార్ హీరో తన తదుపరి సినిమా గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. 2019లో విడుదలైన తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ కైతిని అజయ్ దేవగన్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ధర్మేంద్ర శర్మ దర్శకత్వంలో రానున్న ఈ రీమేక్ సినిమాకి 'భోలా' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. మార్చి 30, 2023న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు ఈ స్టార్ హీరో సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ యాక్షన్ డ్రామాలో టబు కథానాయికగా నటించింది. అజయ్ దేవగన్ ఫిల్మ్స్, టి-సిరీస్ ఫిల్మ్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa