ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరలక్ష్మి శబరి లో కీలక పాత్రలో కనిపించనున్న ప్రముఖ నటుడు

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 20, 2022, 10:45 AM

టాలీవుడ్ అండ్ కోలీవుడ్ లో ఇటీవలి కాలంలో అత్యంత బిజీగా ఉన్న నటీమణులలో వరలక్ష్మి శరత్‌కుమార్ ఒకరు. ఈ గ్లామర్ బ్యూటీ ప్రస్తుతం యశోద, హను-మాన్ అండ్ NBK 107 వంటి తెలుగు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. తాజాగా ఇప్పుడు, అనిల్ కాట్జ్  దర్శకత్వంలో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌పై సంతకం చేసింది. ఈ సినిమాకి 'శబరి' అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. తాజాగా ఈ సినిమాలో మరో ప్రముఖ నటుడు కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈనాడు, డమరుకం వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న గణేష్ వెంకట్రామన్ 'శబరి' లో కీలక పాత్రలో నటిస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో వరలక్ష్మి బిజీగా ఉన్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమా షూటింగ్ వైజాగ్, హైదరాబాద్, కొడైకెనాల్ తదితర ప్రాంతాల్లో జరగనుంది. ఈ చిత్రంలో మైమ్ గోపీ, శశాంక్, సునయన తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. మహా మూవీస్ ఈ సినిమాని నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa