అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం ఎఫ్ 3. 2019లో విడుదలైన ఎఫ్ 2 కి సీక్వెల్గా ఈ సినిమా తెరకెక్కనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మిస్తున్న ఈచిత్రానికి దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. తమన్నా,మెహ్రీన్ ఈ సినిమాలో కధానాయికలు కాగా, రాజేంద్ర ప్రసాద్, సునీల్, మురళి శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సోనాల్ చౌహన్ అతిధి పాత్రలో సందడి చేయనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని వేసవి కానుకగా మే 27న విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన లబ్ డబ్ లబ్ డబ్ డబ్బో... పాట కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది.
తాజాగా, ఎఫ్ 3 సినిమాలో చాలా ఆసక్తికరంగా సాగే సన్నివేశంలో ఉండే హూ ఆఁ ఆహా ఆహా... అనే పాటకు సంబంధించిన ప్రోమో విడుదల అయింది. వెంకటేష్-తమన్నా, వరుణ్-మెహ్రీన్ ల మధ్య సాగే రొమాంటిక్ డ్యూయెట్ గా ఉండనుంది ఈ సాంగ్. ఎఫ్ 2 లో 'రయ్యా రయ్యా ' పాటను తలపించే విధంగా ఉంది ఈ ప్రోమో. అప్పటిలాగానే ఈ పాటలో కూడా తమన్నా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. తమన్నా గ్రేస్ మూవ్మెంట్స్, మెహ్రీన్ గ్లామర్ తో ఈ పాట సూపర్ హిట్ అయ్యేలా ఉంది. ఈ సినిమాలో క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే ఐటెం సాంగ్ తో అలరించనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa