టాలీవుడ్ యువనటుడు విశ్వక్ సేన్ హీరోగా, విద్యాసాగర్ డైరెక్షన్లో రూపొందిన చిత్రం అశోకవనంలో అర్జునకల్యాణం. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయిపోయింది కానీ కరోనా మరియు ఇతర కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. రుక్సార్ ధిల్లాన్ హీరోయిన్గా నటించిన ఈ మూవీ ఎట్టకేలకు మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో పెళ్లి కావటం లేదని బాధపడుతున్న అల్లం అర్జున్ కుమార్ గా విశ్వక్ నటించగా , పసుపులేటి మాధవి గా రుక్సార్ నటించారు. BVSN ప్రసాద్ సమర్పణలో SVCC డిజిటల్ బ్యానర్ పై బాపినీడు, సుధీర్ ఈదర ఈ సినిమాని నిర్మించారు.
తాజాగా ఈ మూవీ నుండి థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. దాదాపు 3 నిమిషాల పాటు ఉన్న ట్రైలర్ ను చూస్తుంటే ఈ సినిమా ఒక కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గానే కాక, ఇందులో ఎమోషన్, రొమాన్స్ కూడా ఉంటాయని తెలుస్తుంది. ఆద్యంతం ట్రైలర్ ఎంతో ఫన్ గా, ఇంటరెస్టింగ్ గా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa