ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్ సేతుపతి 'మెర్రీ క్రిస్మస్' సెట్స్ లో ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 21, 2022, 11:49 AM

శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఒక హిందీ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. ఈ సినిమాకి 'మెర్రీ క్రిస్మస్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో రాధిక శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తుండగా, ఆమె పోలీసుగా కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా నుండి ఒక వర్కింగ్ స్టిల్ వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో ప్రముఖ సీనియర్ నటి రాధికతో బాలీవుడ్ గ్లామర్ క్వీన్ కత్రినా కైఫ్‌ కనిపిస్తున్నారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా అండ్ ఇంటర్నెట్ లో ఫుల్ వైరల్ గా మారింది. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa