చిరంజీవి- కాజల్ అగర్వాల్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఆచార్య. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమా టాలీవుడ్ నుంచి మరో క్రేజీ మల్టీ స్టారర్ గా మారింది. అయితే సినిమా విడుదల సమయం తక్కువగా ఉండడంతో అన్ని చోట్లా ఇప్పటికే విడుదలకు భారీ సన్నాహాలు మొదలయ్యాయి.
అయితే ఓవర్సీస్‌లో ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రైమ్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. ఒక్క యూఎస్ లోనే ఈ చిత్రాన్ని 400లకు పైగా థియేటర్లలో, 3200కి పైగా స్క్రీన్లలో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. అలాగే ఇప్పటికే ఈ సినిమా బుకింగ్స్ ఇప్పుడు మిలియన్ డాలర్లకు చేరువైనట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ మెగా బ్లాస్ట్ కి మంచి ఆదరణ లభించడం ఖాయం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa