కోలీవుడ్ దర్శకురాలు సుధా కొంగర సూరరై పొట్రు/ఆకాశం నీ హద్దు రా సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ఈ స్టార్ దర్శకురాలు తన తదుపరి సినిమా గురించి ఎలాంటి వివరాలను ప్రకటించలేదు. తాజా అప్‌డేట్ ప్రకారం, సుధ తన తదుపరి చిత్రాన్ని కెజిఎఫ్ సినిమాని నిర్మింయించిన హోంబాలే నిర్మాతలతో లాక్ చేసినట్లు సమాచారం. ఈ సినిమా నిజమైన సంఘటనల ఆధారంగా రియలిస్టిక్ డ్రామాగా తెరకెక్కనుంది. హోంబలే ఫిలింస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా పాన్-ఇండియా విడుదల అవుతుంది. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa