ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'జన గణ మన' ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చిన జాన్వీ కపూర్

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 22, 2022, 12:32 PM

సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో స్పోర్ట్స్ డ్రామా ట్రాక్ లో వస్తున్న "లైగర్" సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. వీళ్ళ కాంబినేషన్ లో మరొక సినిమా వస్తుంది అని అందరికి తెలిసిన విషయమే. పూరి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ "జన గణ మన" సినిమాలో విజయ్ దేవరకొండ ఆర్మీ మేన్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుంది వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా జరిగిన మీడియా ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ ని 'జనగణమన' ప్రాజెక్ట్ గురించి అడిగినప్పుడు...... ఈ బ్యూటీ క్వీన్ ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చింది. ఈ రూమర్స్ ని నమ్మకండి నేను ఇంకా ఏ తెలుగు లేదా తమిళ చిత్రానికి సైన్ చేయలేదు. ఒక వేల నేను సైన్ చేస్తే నేను లేదా ప్రొడక్షన్ హౌస్ ప్రకటిస్తాము అని జాన్వి కపూర్ సమాధానమిచ్చింది. పాన్ ఇండియా లెవెల్ లో తీస్తున్నా ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చనున్నాడు. ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు త్వరలో ప్రారంభించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa