ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏంజెల్‌గా మారిన మీరా జాస్మిన్

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 22, 2022, 01:03 PM

"గుడుంబా శంకర్", " భద్ర", "గోరింటాకు" వంటి సినిమాలలో నటించి తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయినా మలయాళీ నటి మీరా జాస్మిన్ గురించి అందరికి తెలుసు. ఆమె తెలుగులో చివరిగా 2010లో విడుదలైన "ఆకాశ రామన్న" సినిమాలో కనిపించింది. బ్లబ్బిగా ఉండె ఈ నటి ఇప్పుడు చాలా బరువు తగ్గింది మరియు తన గ్లామర్ పెంచింది. తాజాగా ఇప్పుడు ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వైట్ డ్రెస్ లో దిగిన ఫొటకి 'డ్రీమీ కైండ్ ఆఫ్ డిలైట్' అనే క్యాప్షన్‌ ని కూడా ఇచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఫొటోస్ చక్కర్లు కొడుతున్నాయి. నేషనల్ అవార్డ్ విన్నర్ మీరా జాస్మిన్ త్వరలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ హీరోగా నటించే సినిమాతో  రీఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ బ్యూటీ సెకండ్ ఇన్నింగ్స్ లో ఎలా ఆక్ట్ చేస్తుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa