ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంస్టెంట్ చార్ట్ బస్టర్ గా 'కాతువాకుల రెండు కాదల్' లోని డిప్పమ్ డప్పమ్ సాంగ్

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 23, 2022, 09:58 AM

విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో గ్లామర్ బ్యూటీ సమంత 'కాతువాకుల రెండు కాదల్' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార అండ్ విజయ్ సేతుపతి కూడా ప్రధాన పత్రాలు పోషిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం మూవీ టీమ్ ఈ సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేయునట్లు ప్రకటించారు. ఈ సినిమా నుండి మూవీ మేకర్స్ 'టూ టూ టూ' పాటని విడుదల చేయగా ఇప్పటికే ఈ సాంగ్ చార్ట్ బస్టర్ గా మారింది. తాజాగా ఇప్పుడు ఈ చిత్రంలోని బ్రేకప్ సాంగ్‌ని 'డిప్పమ్ డప్పమ్' అనే టైటిల్ తో లిరికల్ వీడియోని మూవీ మేకర్స్ విడుదల చేసారు. ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియా అండ్ ఇంటర్నెట్ లో ఫుల్ వైరల్ అవుతోంది. ఏప్రిల్ 28న ఈ సినిమా పలు భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. విఘ్నేష్ శివన్‌ల రౌడీ పిక్చర్స్ అండ్ సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa