ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆచార్య నుంచి కాజల్ అగర్వాల్ సీన్స్ తొలిగింపు

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 25, 2022, 12:09 PM

మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ‘ఆచార్య’. కాగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్.. చిరు సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఐతే.. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ పోస్ట్ ఫోన్ కావడం.. అంతలో కాజల్ గర్భవతి కావడంతో ఆమె పార్ట్ కి సంబంధించిన షూట్ ను పూర్తి చేయలేక పోయారు మేకర్స్.అందుకే, ఇప్పటికే కాజల్ ఈ సినిమా నుంచి తప్పుకుందని కూడా వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఆచార్య నుంచి కాజల్ అగర్వాల్ పాత్రను పూర్తిగా తొలగించారు. మరి ఆమె పాత్ర ప్లేస్ లో ఎవరు కనిపిస్తారో.. ? లేక, అసలు ఆ పాత్రను సినిమా నుంచో పూర్తిగా తీసేశారో చూడాలి.ఇక ఈ సినిమాలో రామ్‌ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటించారు. కాగా మెగాస్టార్ ఈ చిత్రం కోసం బరువు తగ్గడంతో పాటు చాలా మేక్ ఓవర్ అయ్యారు. ఈ చిత్రంలో రెజీనా ఓ సాంగ్ లో కనిపించనుంది రామ్‌ చరణ్, నిరంజన్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa