అంతిమ ఫలితం కన్నా కొంతమంది ఆ ఫలితాన్ని అందుకునే క్రమంలో చేసే ప్రయాణాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఈ కోవకే వస్తారు కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా. దేశవ్యాప్తంగా ఆయన పేరు మారు మోగిపోతుంటే ఆయన మాత్రం ఎంతో నిశబ్దతను పాటిస్తున్నారు.
సాధారణంగా ఒక సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా సక్సెస్ సెలెబ్రేషన్స్ ను ఓ రేంజులో చేసేస్తుంటారు కొంతమంది దర్శకనిర్మాతలు. కానీ కేజీఎఫ్ చిత్రబృందం మాత్రం అందుకు భిన్నం. సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతూ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నా ఏ మాత్రం హంగూఆర్భాటాలు పోలేదు ప్రశాంత్. మూవీ విడుదలై పది రోజులు కావొస్తుంటే సక్సెస్ సెలెబ్రేట్ చేసుకోవటానికి ఇప్పటికి తీరిక దొరికింది ప్రశాంత్ కి. వరల్డ్ వైడ్ గా ఇప్పటికే వెయ్యి కోట్ల కలెక్షన్లు సాధించిన ఈ సినిమాకు బాలీవుడ్ నుండే ఏకంగా 300కోట్ల పై చిలుకు కలెక్షన్స్ వచ్చాయి. దీంతో కేజీఎఫ్ 2 డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో యష్, నిర్మాత విజయ్ కిరంగదుర్ లు కలిసి కేక్ కట్ చేసి సక్సెస్ ను సెలెబ్రేట్ చేసుకున్నారు. పోతే... కేజీఎఫ్ 2 చిత్రం ఇంతటి ఘనవిజయాన్ని సాధించినా చిత్రబృందం మాత్రం ఎలాంటి హడావిడి చేయకుండా ఎంతో హుందాగా ప్రవర్తిస్తున్న తీరు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa