రజినీ సినిమా అంటేనే ఓ రేంజ్. ఆయన సినిమాలో ఓ యంగ్ హీరోకి ఛాన్స్ వచ్చిందటే ఇక ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కొంతకాలం క్రితం వరకూ రజనీకాంత్ సీనియర్ దర్శకులకు మాత్రమే వరుస అవకాశాలిస్తూ వెళ్లారు. ఆ తరువాత ఆయన యువ దర్శకులకు కూడా ఛాన్సులు ఇవ్వడం మొదలుపెట్టారు. వాళ్లంతా కూడా తనని మరింత కొత్తగా చూపిస్తూ ఉండటంతో, యువ దర్శకులతో కలిసి పనిచేయడానికే ఆయన ఎక్కువ ఉత్సాహాన్ని చూపుతున్నారు.
ఈ నేపథ్యంలోనే నెల్సన్ దిలీప్ కుమార్ కి ఆయన అవకాశం ఇచ్చారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతోంది. కెరియర్ పరంగా ఇది రజనీకి 169వ సినిమా. సన్ పిక్చర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'బీస్ట్' సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, నెల్సన్ ను పక్కన పెట్టకుండా సన్ పిక్చర్స్ వారు ఆయనతో ఈ సినిమా చేస్తుండటం విశేషం.
ఈ సినిమాలోని ఒక కీలకమైన పాత్రను ఒక యంగ్ హీరో చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో, శివకార్తికేయన్ ను సంప్రదించారట. గతంలో ఆయనకి 'డాక్టర్' సినిమాతో నెల్సన్ దిలీప్ కుమార్ హిట్ ఇచ్చాడు. 100 కోట్ల క్లబ్ లో చేరిన ఆ సినిమాకి శివకార్తికేయన్ నిర్మాత కూడా. అందువలన రజనీ సినిమాలో చేయడానికి ఆయన అంగీకరించాడని అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa