కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన కొత్త చిత్రం బీస్ట్. పూజా హెగ్డే కథానాయిక.వరుణ్ డాక్టర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో ఔటండౌట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందింది. అనిరుధ్ అందించిన సంగీతం తో ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. ఏప్రిల్ 13న విడుదలైన ఈ సినిమా తొలిరోజుల్లో బాగానే వసూలు చేసినప్పటికీ ఆ తర్వాత ఒకేసారి కలెక్షన్లు తగ్గిపోయాయి. కేజీఎఫ్ 2 కు పోటీగా నిలుస్తుందనుకున్న బీస్ట్ ఆ సినిమాకు ఏ మాత్రం పోటీనివ్వలేకపోయింది. విజయ్ అభిమానులకు కూడా ఈ సినిమా అంతగా నచ్చలేదు. ఆఖరికి విజయ్ తండ్రి కూడా ఈ సినిమా ఫెయిల్యూర్ ను అంగీకరించటం గమనార్హం.
ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం చేరుకొని ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలవనుంది. ఇదంతా పక్కన పెడితే, తాజాగా హీరో విజయ్ బీస్ట్ చిత్రబృందం మొత్తానికి తన స్వగృహంలో పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి బీస్ట్ చిత్ర దర్శకుడు నెల్సన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, హీరోయిన్ పూజా హెగ్డే, సతీష్, VTV గణేష్ తదితరులు పాల్గొన్నారు. అందరూ కలిసి డిన్నర్ చేస్తున్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. బీస్ట్ మూవీ ఫలితాన్ని ఏ మాత్రం లెక్క చేయకుండా, చిత్రబృందానికి పార్టీ ఇచ్చిన విజయ్ ఎంత మంచివాడు ... అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa