కాసేపట్లో మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' ట్రైలర్ అప్‌డేట్ ఉంటుందని చిత్రబృందం ప్రకటించగానే ఫ్యాన్స్ జోష్‌లో ఉన్నారు. 'క్రాకర్స్ కొనేశాం అమ్మా.. ఇంకా శ్రీకాకుళంలో మాస్ జాతర చూపిస్తాం' అని ఓ అభిమాని ట్వీట్ చేశాడు. 'అబ్బే! సరిపోవుగా..' అంటూ సర్కారు వారి పాట అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ రిప్లై ఇచ్చింది. 'హైప్‌తో సచ్చిపోతున్నాం భయ్యా..' అని మరో ఫ్యాన్ కామెంట్ చేశాడు.
అయితే ఈ సినిమా ట్రైలర్ అంతా ఫుల్ యాక్షన్‌తో కూడుకుని ఉన్నట్టు సమాచారం. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. కళావతి పాటైతే రికార్డులు బద్దలుగొడుతోంది. మ్యూజిక్ లవర్స్ నుంచి భారీ రెస్పాన్స్ అందుకున్న ఈ పాట తాజాగా ఓ అరుదైన రికార్డు సాధించింది. ఈ సాంగ్ 150 మిలియన్ల వ్యూస్‌ను సంపాదించి రికార్డుకెక్కింది. తమన్ సంగీతం అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా ఆలపించాడు. సినిమా ఇప్పటికే మ్యూజికల్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో..సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ చిత్రాన్ని జీఎంబీ ప్రొడక్షన్స్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa