ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఆచార్య' లో రామ్ చరణ్‌కి పవన్ కళ్యాణ్ బెస్ట్ ఆల్టర్నేటివ్ అని అంటున్న మెగా స్టార్

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 27, 2022, 12:08 PM

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అండ్ రామ్ చరణ్ నటించిన 'ఆచార్య' సినిమా ఏప్రిల్ 29, 2022న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది. శివ కొరటాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజాహెగ్డే కథానాయికగా నటించింది. మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా మీడియా ప్రెస్ మీట్ పెట్టి సినిమా గురించిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానమిచ్చారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సిద్ధ పాత్ర చేస్తే ఎలా ఫీలవుతారని ప్రశ్నించగా..... ఈ సినిమాలో పవన్ కూడా అద్భుతంగా నటించేవాడు అని చిరు అంటున్నారు. చరణ్ మరియు చిరు తండ్రీ కొడుకులుగా భావోద్వేగ ప్రభావం ఉంటుందని కూడా  చెప్పారు. అందుకే చరణ్ సిద్ధ పాత్రలో నటించాడు మెగాస్టార్ అన్నారు. చరణ్ కి డేట్స్ కుదరకపోతే ఈ పాత్రలో పవన్ నటించేవాడు వాడు అని వెల్లడించారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ మూవీని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్నాయి. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa