కేజీఎఫ్ ఫ్రాంచైజీ తో దేశవ్యాప్త క్రేజును సొంతం చేసుకున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యష్. 2018లో చిన్న సినిమాగా విడుదలై భారీ కలెక్షన్లను రాబట్టడంతో దానికి కొనసాగింపుగా రాబోతున్న కేజీఎఫ్ 2 పై అంచనాలు ఆకాశాన్నంటాయి. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 ను రూపొందించారు. ఏప్రిల్ 14న విడుదలైన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను వసూలు చేస్తోంది. అయితే కేజీఎఫ్ సినిమా సమయంలో జరిగిన ప్రీ రిలీజ్ ఇంటర్వ్యూలు, ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు వంటి వాటిల్లో కేజీఎఫ్ 2 తర్వాత ఈ సినిమా గురించి చెప్పడానికి అంతగా ఏమి ఉండదు అని ప్రశాంత్, యష్ క్లారిటీ ఇచ్చారు. అంటే దీనర్ధం... కేజీఎఫ్ 2 తో ఈ ఫ్రాంచైజీ ని ముగిస్తున్నట్లు. కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా మారాయి. కేజీఎఫ్ 2 క్లైమాక్స్ లో మూడవ భాగం పై హింట్ ఇచ్చారు. దీనిపై హీరో యష్ క్లారిటీ ఇచ్చారు. ఒక హాలీవుడ్ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యష్ కేజీఎఫ్ పార్ట్ 3 పై నెలకొన్న సందిగ్దతను తొలగించారు. ఆయన ఏమన్నారంటే... కేజీఎఫ్ 2 చిత్రీకరణ సమయంలో మేము గమనించిందేంటంటే, ఈ కధకు సంబంధించిన ఇంకా చాలా విషయాలను ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం ఉంది. దీంతో కేజీఎఫ్ 3 సినిమాను తీయాలనుకున్నాము. అందుకే కేజీఎఫ్ 2 క్లైమాక్స్ లో చిన్న హింట్ ఇచ్చాము. ప్రస్తుతానికైతే కేజీఎఫ్ 2 తో ముగిస్తున్నాము. కానీ తప్పకుండ కేజీఎఫ్ 3 సినిమా ఉంటుంది. అయితే అది ఎప్పుడు పట్టాలెక్కుతుందనేది చెప్పలేము.... అని యష్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులోనైనా కేజీఎఫ్ 3 సినిమా వస్తుందని చెప్పి కేజీఎఫ్ అభిమానులకు, ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పారు రాఖీభాయ్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa