ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిర్మాతగా తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన నిహారిక కొణిదెల

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 27, 2022, 01:11 PM

మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల తన తదుపరి ప్రాజెక్ట్‌ను నిర్మాతగా ప్రకటించింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్‌ని కలిగి ఉన్న సంగతి అందరికి తెలిసిందే. ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ ZEE5 కోసం ఈ ప్రాజెక్ట్‌ను నిహారిక నిర్మిస్తోంది. శివసాయి వర్ధన్ జలదంకి దర్శకత్వంలో రానున్న ఈ సిరీస్ కి 'హలో వరల్డ్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ అధికారిక పూజా కార్యక్రమాలతో ప్రారంభించబడింది. ఈ సిరీస్‌లో ఆర్యన్ రాజేష్ కథానాయకుడిగా నటిస్తున్నారు. సదా, రామ్ నితిన్, నిఖిల్, సుదర్శన్, అనిల్ గీలా, నిత్యా శెట్టి  ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో కీలక పాత్రలలో కనిపించనున్నారు. పికె దండి 'హలో వరల్డ్‌' సిరీస్ కి సంగీతం అందించారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa