మహేష్ పి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి కామెడీ ఓరియెంటెడ్ లవ్ స్టోరీ సినిమా ప్రకటించిన సంగతి అందరికి తెలిసందే. ఈ సినిమాలో నవీన్ సరసన బబ్లీ బ్యూటీ అనుష్క శెట్టి జోడిగా నటిస్తుంది. ఈ సినిమా అధికారికంగా ప్రకటించబడింది. ఈ సినిమాకి మూవీ మేకర్స్ ఇంకా టైటిల్ ని లాక్ చేయలేదు. 37 ఏళ్ల అమ్మాయి అండ్ 27 ఏళ్ల అబ్బాయి మధ్య ప్రేమ ట్రాక్ చుట్టూ ఈ సినిమా వెళ్లనుంది అని సమాచారం. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమాలో అనుష్క ఇంటర్నేషనల్ చెఫ్‌గా కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో అనుష్క క్యారెక్టర్ సరికొత్తగా ప్రెజెంట్ చేస్తున్నట్లు మూవీ మేకర్స్ వెల్లడించారు. UV క్రియేషన్స్ ఈ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీని నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కి సంభందించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa