టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 'RRR' సినిమాతో విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో కొరటాల శివ డైరెక్షన్ లో ఒక సినిమాకి సైన్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి టెంపరరీగా 'NTR30' అనే టైటిల్ ని పెట్టారు. 'ఎన్టీఆర్ 30' సినిమాకు కావాల్సిన ఫిజిక్‌ని నిర్మించుకునేందుకు శిక్షణ తీసుకుంటాడు అని లేటెస్ట్ టాక్. తారక్ పుట్టినరోజు సందర్భంగా మే 20న ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి. 7-8 నెలల్లో ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసి, వచ్చే వేసవిలో సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa