మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ లు కలిసి నటించిన సినిమా 'ఆచార్య' చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఈ సినిమాలో చరణ్ సరసన పూజ హెగ్డే హీరోయినిగా నటించింది.‘ఆచార్య’ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. ఈ మూవీ థియేటర్లలోకి వచ్చి, కనీసం మూడు వారాలయ్యాక అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అంటే మే నెల చివర్లో ‘ఆచార్య’ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. అయితే దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa