టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో చేసిన చిత్రం ఆచార్య. ఇందులో రామ్ చరణ్ తేజ్ సిద్ధ అనే స్పెషల్ రోల్ లో నటించాడు. చెర్రీ సరసన పూజాహెగ్డే కథానాయికగా నటించింది. ఎప్పుడో విడుదలవ్వాల్సిన ఈ చిత్రం పలు కారణాల వల్ల వాయిదా పడుతూ నిన్ననే అంటే ఏప్రిల్ 29న థియేటర్లలోకొచ్చింది. మెగా అభిమానులహాతో సహా ప్రేక్షకులు సైతం ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ మూవీ తొలి షో నుండే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. దేశవ్యాప్తంగా ఆచార్య తొలిరోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే... నైజాం - రూ. 7.99 కోట్లు, సీడెడ్ - రూ. 4.60 కోట్లు, ఉత్తరాంధ్ర - రూ. 3.61 కోట్లు, ఈస్ట్ - రూ. 2.53 కోట్లు, వెస్ట్ - రూ. 2.90 కోట్లు, గుంటూరు - రూ. 3.76 కోట్లు, కృష్ణా- రూ. 1.90 కోట్లు, నెల్లూరు - రూ. 2.30 కోట్ల తో ఏపీ, తెలంగాణాలలో కలిపి మొత్తంగా ఆచార్య చిత్రం తొలి రోజున రూ. 29.59 కోట్లు వసూలు చేసింది. ఏపీ తెలంగాణా మినహాయించి రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లలో కలిపి మరో 6 కోట్లు కలెక్ట్ చేసిఉంటుందని అంచనా. మొత్తంగా తొలి రోజు ఆచార్య 35 కోట్ల షేర్ ను సాధించింది. చిరంజీవి చిత్రం మొదటి రోజు కాబట్టి ఈ మాత్రం వసూళ్లు అందరూ ఊహించేదే. అయితే నెగిటివ్ టాక్ వల్ల రాబోయే రోజుల్లో ఈ మూవీ కలెక్షన్లు ఎలా ఉంటాయనేది ఆసక్తిగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa