స్టీఫెన్ దర్శకత్వంలో 'ఇంద్రాణి' అనే టైటిల్ తో భారతదేశపు తొలి సూపర్ గర్ల్ సినిమా వస్తున్న సంగతి అందరికి తెలిసందే. ఈ సినిమాలో యానీ భరద్వాజ్ అండ్ ప్రణీత బిజినా కీలక పాత్రలు పోషిస్తుండగా, కబీర్ దుహన్ సింగ్ విలన్‌గా నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా మోషన్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా 2022 అక్టోబర్ 27న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ షతాఫ్ ఫిగర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. షతాఫ్ ఫిగర్ ఈ చిత్రంలో జనరల్ డయ్యర్ పాత్రను పోషిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 'ఇంద్రాణి'ని పక్కా మాస్ మార్వెల్ మూవీగా రాబోతుంది అని నిర్మాత స్టీఫెన్ వెల్లడించారు. శ్రేయ్ మోషన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa