కోలీవుడ్ సినిమాలలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్' ప్రాజెక్ట్ ఒకటి. ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉండగా రెండు భాగాలుగా రూపొందుతోంది అని సమాచారం. తాజా అప్డేట్ ప్రకారం, అమెజాన్ ప్రైమ్ వీడియో 'పొన్నియన్ సెల్వన్' పార్ట్ 1 అండ్ 2 OTT రైట్స్ ని భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు సమాచారం. 'పొన్నియిన్ సెల్వన్ 1' అండ్ 'పొన్నియిన్ సెల్వన్ 2' కోసం భారీ అమెజాన్ 125 కోట్ల రూపాయలకు డీల్ లాక్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా రెండు పార్టుల బడ్జెట్ మొత్తం 500 కోట్లు అని లేటెస్ట్ టాక్. ఈ భారీ బడ్జెట్ పీరియడ్ మూవీలో కార్తీ, విక్రమ్, జయం రవి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్‌ని అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa