టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సంతోష్ శోభన్ 'పేపర్ బాయ్', 'మంచి రోజులు వచ్చాయి' వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. తాజాగా ఇప్పుడు ఈ యంగ్ హీరో యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో ఒక సినిమాకి సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అనిల్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో కోలీవుడ్ గ్లామర్ బ్యూటీ ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమాకు 'కళ్యాణం కమనీయనం' అనే టైటిల్‌ను మూవీ మేకర్స్ ఖరారు చేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa