సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'RC15' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం, మే మొదటి వారంలో 'RC15' కొత్త షెడ్యూల్‌ను మూవీ మేకర్స్ స్టార్ట్ చేసాయనున్నట్లు సమాచారం. ఈ నెల 5న రామ్ చరణ్ ఈ మూవీ సెట్స్‌లోకి జాయిన్ అయ్యే అవకాశం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ హై బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ కొత్త షెడ్యూల్ వైజాగ్‌లో జరుగుతుంది అని టాక్. దిల్ రాజు తన హోమ్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa