మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సైన్టిఫిక్ ఫిక్షన్ థ్రిల్లర్ ప్రాజెక్ట్ K. ప్రస్తుతం ప్రాజెక్ట్ K అనేది ఈ సినిమాకి వర్కింగ్ టైటిల్ మాత్రమే. త్వరలోనే ఈ మూవీ టైటిల్ ను ఎనౌన్స్ చేయనున్నారు చిత్రబృందం. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తుండగా, దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాలో వాడబోయే ఆధునిక సాంకేతిక వాహనాల తయారీ కోసం అశ్విన్ మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సహాయం తీసుకోనున్నారన్న విషయం తెలిసిందే. ప్రభాస్ మోకాలి చికిత్స కారణంగా ఈ మూవీ షూటింగ్ కొంతకాలం వాయిదా పడగా తాజాగా తిరిగి ప్రారంభమైనట్టు తెలుస్తోంది. సీనియర్ ఆర్ట్ డైరెక్టర్ తోటతరణి సారథ్యంలో, హైదరాబాదులో నిర్మించబడిన మూడు భారీ సెట్లలో ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతుందట. ఈ షెడ్యూల్ లో ప్రభాస్, దీపికా, అమితాబ్ పాల్గొంటున్నారని టాక్. వీళ్ళ కాంబినేషన్ లో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. నాగ్ అశ్విన్ ఈ సినిమాను పాన్ వరల్డ్ సినిమాగా అభివర్ణించటంతో అందరిలో ఆసక్తి నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa