ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రెండింగ్ లో “సర్కారు వారి పాట” ట్రైలర్!

cinema |  Suryaa Desk  | Published : Tue, May 03, 2022, 12:18 PM

దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ "సర్కారు వారి పాట". ఈ సినిమాలో సూపర్ స్టార్ సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ తొలిసారిగా నటిస్తుండగా, ఈ సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి మరియు అభిమానుల నుండి భారీ స్పందన వస్తోంది.


నిన్ననే ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్. విడుదలై సెన్సేషనల్ రెస్పాన్స్ అందుకున్న ఈ ట్రైలర్ మొదటి నిమిషం నుండే మాస్ రికార్డులు క్రియేట్ చేయడం ప్రారంభించింది. రికార్డు స్థాయిలో ఫాస్టెస్ట్ రికార్డులతో ప్రారంభమైన మాస్ యుఫోరియా ట్రైలర్ తాజాగా 25 మిలియన్ల మైలురాయిని దాటింది. ఇప్పటికే 1 మిలియన్ కంటే ఎక్కువ మంది లైక్‌లు సాధించి టాలీవుడ్‌లో ఆల్‌టైమ్ రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ క్రేజీ ట్రైలర్ కూడా యూట్యూబ్‌లో నెంబర్ 1 ట్రెండింగ్‌గా నిలిచింది. వ్యూస్, లైక్స్ పరంగా ఇప్పటికే 24 గంటల ముందే ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన ఈ ట్రైలర్ 24 గంటల్లో ఎలా ఉండబోతుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa