తన కొత్త సినిమా అశోకవనంలో అర్జునకళ్యాణం ప్రమోషన్స్ కోసం ప్రాంక్ వీడియో చేసి అనవసరంగా వివాదాస్పదమయ్యాడు హీరో విశ్వక్ సేన్. ఈ విషయం పక్కన పెడితే, ఒక ప్రముఖ వార్తా ఛానెల్ డిబేట్ లో పాల్గొన్న విశ్వక్ ఒక అసభ్యకర పదం వాడినందుకు మరింత వివాదాస్పదమయ్యాడు. ఈ మేరకు తను చేసిన ప్రాంక్ వీడియో పట్ల పబ్లిక్ కు వివరణ ఇచ్చుకునేందుకు ప్రముఖ వార్తా ఛానెల్ లో డిబేట్ కు పాల్గొన్న విశ్వక్ ఆ షో యాంకర్ అతన్ని ఉద్దేశిస్తూ మాట్లాడిన పదాలకు తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఆ లేడీ యాంకర్ విశ్వక్ ను పాగల్ సేన్, డిప్రెస్డ్ పర్సన్ అని సంభోధించింది. ఇది విన్న విశ్వక్ ఆమె మాటలను సహించలేక ఫ* అనే అసభ్యకర పదజాలాన్ని వాడాడు. విశ్వక్ ఇలాంటి పదం వాడినందుకు చాలా నెగిటివిటీ ను ఎదుర్కొంటున్నాడు. దీంతో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి డిబేట్ లో ఫ* అనే అసభ్యకర పదజాలాన్ని వాడినందుకు మీడియాకు క్షమాపణలు తెలిపారు. దెబ్బ తగిలితే అమ్మా అని ఎలా అనుకోకుండా అరుస్తామో ఆ పదం కూడా నానోటి నుండి అలా అనుకోకుండా వచ్చేసింది. ఇది తప్ప మరే తప్పును నేను చెయ్యలేదు. దీనిపై ఒక సారీ నోట్ ను కూడా ప్రిపేర్ చేస్తున్నాను..... అంటూ విశ్వక్ చెప్పుకొచ్చాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa